Tuesday, February 24, 2026
spot_img
Homeతెలంగాణ"హరీశ్‌రావు మీద కవిత వ్యాఖ్యలు అన్యాయం… ఉద్యమ స్ఫూర్తి ఉన్న నాయకుడిపై ఇలా మాట్లాడడం సరైంది...

“హరీశ్‌రావు మీద కవిత వ్యాఖ్యలు అన్యాయం… ఉద్యమ స్ఫూర్తి ఉన్న నాయకుడిపై ఇలా మాట్లాడడం సరైంది కాదు” — బండా నరేందర్ రెడ్డి

సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు అసత్య ఆరోపణలేనని బీఆర్‌ఎస్‌ మాజీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్యమం మొదలైన రోజునుంచి హరీశ్‌రావు పార్టీ కోసం ఎదుర్కొన్న కష్టాలు, చేసిన పోరాటం అందరికీ తెలిసిన విషయమని ఆయన గుర్తుచేశారు. “హరీశ్‌రావు ఎవరో, ఆయన పాత్ర ఏంటో కార్యకర్తలకు బాగా తెలుసు… ఆయనకు ఎవరైనా సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు” అని నరేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.

పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ— తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ పార్టీని తెరపైకి తీసుకొచ్చినప్పుడు, ప్రజల్లో తిరిగి ప్రచారం చేసిన తొలి నాయకుల్లో హరీశ్‌రావు ఒకరని చెప్పారు. “ఆ రోజులలో హరీశ్‌రావు రాష్ట్రం కోసం వీధుల్లో పోరాడుతుండగా… కవిత విదేశాల్లో ఉన్నారు” అని వ్యాఖ్యానించారు.

కవిత కాంగ్రెస్‌కు తోడుగా మారిందని విమర్శలు

బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజాసమస్యలపై కాకుండా కాంగ్రెస్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని నరేందర్ రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీ గెలుపుకే సహకరిస్తున్నట్టుగా ఆమె వ్యాఖ్యలు మారుతున్నాయని విమర్శించారు. కేటీఆర్‌కు అండగా నిలిచే హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి వంటి నేతలను కవిత టార్గెట్ చేస్తూ వారిని కేటీఆర్‌కు దూరం చేయడం— రేవంత్ రెడ్డి వేసిన ప్లాన్‌లో భాగమని ఆయన తెలిపారు.

లిక్కర్ కేసులో చిక్కుకున్న సమయంలో కూడా పార్టీ కార్యకర్తలు కవితకు అండగా నిలిచారని, కానీ ఇప్పుడు ఆమె కాంగ్రెస్ వైపు మరింతగా వాలిపోయినట్టు కనిపిస్తున్నారని అన్నారు. “ముఖ్యమంత్రి రేవంత్ చెప్పే మాటలనే కవిత మాట్లాడుతున్నారు… ఇది స్పష్టమైన సంకేతం” అని వ్యాఖ్యానించారు.

బీఆర్‌ఎస్ బలోపేతం మాత్రమే లక్ష్యం

తెలంగాణ జాగృతి పేరుతో వచ్చినప్పుడు కవితను కేసీఆర్ కూతురు అని గౌరవంతో కార్యకర్తలు స్వాగతించారని, ఇప్పుడు ఆమె ప్రవర్తన పార్టీ క్యాడర్ ఉత్సాహాన్ని తగ్గించేలా మారిందని నరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

హరీశ్‌రావును పార్టీ నుంచి దూరం చేయాలనే ప్రయోగాలు అవినీతి పేరుతో జరుగుతున్నాయని, బీఆర్‌ఎస్‌ని చీల్చడం లక్ష్యంగా కుట్ర నడుస్తోందని ఆయన ఆరోపించారు. “ఎట్టకేలకు కేసీయారే తెలంగాణకు రక్ష… ఆయన నాయకత్వంలోనే బీఆర్‌ఎస్ తిరిగి బలంగా నిలుస్తుంది” అని నమ్మకం వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంపై మాట్లాడుతూ— “అది కాంగ్రెస్ గెలుపు కాదు… అడ్డదారులు వేసిన విజయం. మోసాల పార్టీ అయిన కాంగ్రెస్ మాయలో కవిత పడకూడదు” అని హెచ్చరించారు.

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, మాజీ ఆర్వో శరణ్యా రెడ్డి, మాజీ చైర్మన్ సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్‌, తదితర శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
epaperprajaavelugu

Most Popular

Recent Comments