Tuesday, February 24, 2026
spot_img
Homeఆంధ్రప్రదేశ్ఆంధ్ర వాతావరణంలో డబుల్ షాక్: వరసగా రెండు అల్పపీడనలు—రాబోయే రోజుల్లో భారీ వర్షాల హెచ్చరిక!

ఆంధ్ర వాతావరణంలో డబుల్ షాక్: వరసగా రెండు అల్పపీడనలు—రాబోయే రోజుల్లో భారీ వర్షాల హెచ్చరిక!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ వాతావరణాన్ని ప్రభావితం చేయనుంది. ఇప్పటికే ఈ వ్యవస్థ కారణంగా రాయలసీమ దిశగా వర్ష సూచనలు వెలువడగా… అదికాక మరో ట్విస్ట్ కూడా బయటపడింది. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం వెనుకే మరో వాతావరణం బలపడటానికి సిద్ధమైందని అధికారులు వెల్లడించారు.

సోమవారం వాతావరణం – ఏఏ జిల్లాలు జాగ్రత్త?

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం, నవంబర్ 17వ తేదీకి ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం ఉంది.

నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు రావాలని, వర్షాల సమయంలో ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇంకా ఒక అల్పపీడనం దారిలోనే!

అధికారుల తాజా అంచనాల ప్రకారం, నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం నవంబర్ 24 నుండి 27 వరకు కోస్తా ఆంధ్ర,రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాల రూపంలో కనిపించవచ్చు. రైతులు పంటల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

వర్షాలు పడితే తప్పనిసరి జాగ్రత్త:

కూలీలు, రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద చెట్ల కింద వర్షం నుండి తప్పించుకోవడానికి నిలబడకూడదు. పిడుగులు పడే ప్రమాదం అత్యధికంగా చెట్లపైనే ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అత్యవసరమైతే సమీపంలోని సురక్షిత భవనాల్లో ఉండాలని సూచన.చలికి విశ్రాంతి లేదు – రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయిఅల్పపీడనం కొనసాగుతున్నా, చలి ప్రభావం మాత్రం తగ్గడంలేదు.ఏపీ,తెలంగాణ రెండు రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ వరకు పడిపోతున్నాయి.
IMD అంచనా ప్రకారం రాబోయే 2–3 రోజుల్లో సాధారణ స్థాయికి కంటే 2–3 డిగ్రీలు తక్కువగా చలి మరింతగా పెరిగే అవకాశం ఉంది.నవంబర్‌లోనే ఇంతగా చలికాసినందుకు జనవరి–ఫిబ్రవరి నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
epaperprajaavelugu

Most Popular

Recent Comments