పైరసీ ప్రపంచాన్ని కుదిపేసిన iBomma వ్యవహారంలో కీలక పాత్రధారి ఇమ్మడి రవి చివరకు పోలీసుల బారినపడ్డాడు. “నా దగ్గర కోట్ల మందిపర్సనల్ డేటా ఉంది… నా సైట్‌ను టచ్ చేస్తే మీకే డేంజర్” అంటూ సోషల్ మీడియాలో బహిరంగ బెదిరింపులు చేసిన అతడిని సైబర్ క్రైమ్ పోలీసులు కట్టడి చేశారు.
తాజాగా, రవి చేతులతోనే iBomma, బప్పం TV లాంటి పైరసీ వెబ్సైట్లు మూసివేయించడమే కాకుండా, అతడి లాగిన్స్, సర్వర్ వివరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇకపై మరలా పైరసీ కార్యకలాపాలకు తావులేకుండా మొత్తం నెట్‌వర్క్‌ను ట్రేస్ చేస్తున్నారు.
అరెస్ట్ ఎలా జరిగింది?
అక్టోబర్ 1 నుండి రవి కదలికలపై పర్యవేక్షణ ప్రారంభించారు.
శనివారం ఉదయం కూకట్‌పల్లిలోని రెయిన్బో విస్టా అపార్ట్మెంట్లో అరెస్ట్ చేశారు.
కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించబడింది.
పోలీసులు 7 రోజుల కస్టడీ కోరారు – అతడికి సహకరించిన నెట్‌వర్క్‌పై విచారణ సాగనుంది.
పోలీసులు స్వాధీనం చేసుకున్నవి
ఇంట్లో ఉన్న హార్డ్‌డిస్క్‌లు, మొబైల్ ఫోన్లు
బ్యాంక్ ఖాతాల్లో ఉన్న ₹3 కోట్లు
డిలీట్ చేసిన డేటా కూడా రికవర్
2018 నుంచి విదేశాలకు IPలను మారుస్తూ పనిచేసిన ఆధారాలు
ఏడేళ్ల క్రితం కొనుకున్న ఫ్లాట్‌లో నిశ్శబ్దంగా ఉంటూ, తన అసలు కార్యకలాపాలను దాచిపెట్టిన రవి… కోర్టు కేసు కోసం వచ్చిన సమయంలోనే అధికారుల కంటపడ్డాడు. ఇంతకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా భావించిన ఆయన అసలు అంతర్జాతీయ పైరసీ గ్యాంగ్‌ను నడిపాడని తెలిసి స్థానికులు షాక్‌కు గురవుతున్నారు.
ఇమ్మడి రవి ఎవరు?
సొంతూరు: విశాఖపట్నం
చదువు: ముంబై యూనివర్సిటీలో MBA
ఉద్యోగం: GettingUp, ER Infotech కంపెనీలకు CEO
తరువాత నెదర్లాండ్స్, కరేబియన్ దీవుల్లో కార్యకలాపాలు
OTT సర్వర్లను హ్యాక్ చేసి కంటెంట్ దొంగిలించడం
Cloudflareలో దాచడం
iBomma, iWin, Bappam వంటి సైట్ల ద్వారా పైరసీ
వ్యూయర్స్‌ను బెట్టింగ్ యాప్స్‌కి మళ్లించే రికార్డులు కూడా బయటపడ్డాయి
అధికారుల స్పందన
iBomma నిర్వాహకుడి అరెస్ట్‌పై Telangana హోంవిభాగం స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ స్పందిస్తూ—
“దమ్ముంటే పట్టుకోమన్న వాడినే పట్టుకున్నాం. సైబర్ క్రైమ్ టీమ్ అద్భుతంగా పని చేసింది” అని అభినందించారు.






