ఐపీఎల్ 2026 సీజన్‌ను ముందుంచి చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం వెల్లడించింది. రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా జట్టులో చేరిన సంజు శాంసన్‌ను చాలా మంది ఆటోమేటిక్‌గా కెప్టెన్‌గా చూస్తుండగా, CSK మాత్రం అభిమానుల అంచనాలను చెదరగొట్టింది. రాబోయే సీజన్లో కూడా రుతురాజ్ గైక్వాడ్‌కే కెప్టెన్సీ కొనసాగించనున్నట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. దీంతో శాంసన్‌కు సారథ్య అవకాశాలు తీరని కోరికగా మిగిలిపోయాయి.
రుతురాజ్ నాయకత్వ ప్రయాణం
ఎంఎస్ ధోనీ స్థానాన్ని భర్తీ చేస్తూ 2024 సీజన్‌కు ముందు రుతురాజ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సీజన్లో CSK 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి 5వ స్థానంలో నిలిచింది.
2025లో గైక్వాడ్ కేవలం 5 మ్యాచ్‌ల్లో మాత్రమే జట్టును నడిపి గాయంతో తప్పుకోగా, ధోనీ మళ్లీ నాయకత్వాన్ని చేపట్టాడు. అయితే జట్టు 4 విజయాలతో చివరి స్థానంలో ముగించింది.
ఈ నేపథ్యంలో 2026లో రుతురాజ్‌పై CSK పునరుద్ధరణ బాధ్యతలు భారీగా పెరిగాయి.
సంజు శాంసన్ కెప్టెన్సీ రికార్డు
సంజు శాంసన్ 2021 నుంచి 2025 వరకు రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా సేవలందించారు. ఆయన నేతృత్వంలో RR 2022లో ఫైనల్‌కి చేరినా, ఆ తరువాత టైటిల్ పోరులోకి దారితీయలేకపోయింది.
మొత్తం 67 మ్యాచ్‌ల్లో శాంసన్ 33 విజయాలు, 32 ఓటములు, 2 నో రిజల్ట్స్‌తో సమతూకమైన రికార్డు నమోదు చేశారు.
ట్రేడింగ్ ద్వారా CSKలో చేరిన తర్వాత, శాంసన్ నాయకత్వం పునరావృతమవుతుందని భావించినా, CSK వేరే దారిని ఎంచుకుంది.
RR కు కొత్త కెప్టెన్ ఎవరు?
సంజు శాంసన్ వెళ్ళిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ ఎంపికపై చర్చలు హీట్‌గా ఉన్నాయి.
ట్రేడింగ్ ద్వారా RRలో చేరిన రవీంద్ర జడేజా అత్యంత బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. గతంలో CSK తరఫున 8 మ్యాచ్‌లకు మాత్రమే కెప్టెన్సీ చేసిన అనుభవం ఆయనకు ఉంది.
అదే సమయంలో
యశస్వి జైస్వాల్,
ధ్రువ్ జురెల్
అనేవారు కూడా నాయకత్వ రేసులో ఉన్నారని జట్టు వర్గాలు సూచిస్తున్నాయి.



